Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్: డైరీలో ప్రముఖ నటి గురించిన వివరాలు రికార్డు!

  • వీసాలు సిఫార్సు చేసిన ఆటా, టీఏఎస్
  • కాలిఫోర్నియా ఈవెంట్ పేరిట వెళ్లి చికాగో చేరుకున్న తెలుగు హీరోయిన్
  • అక్కడి హోటల్ లో వ్యభిచారంపై కిషన్ భార్య డైరీలో సమాచారం
  • తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న సెక్స్ స్కాండల్
అమెరికాకు వెళ్లి వచ్చే హీరోయిన్లు అక్కడ వ్యభిచారం చేస్తున్నారన్న వార్తలు టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తుండగా, ఎవరు ఎప్పుడు వచ్చారు? వారి ట్రావెల్ రికార్డు ఏంటి? ఎక్కడ బస చేశారు? తదితర విషయాలనన్నింటినీ అమెరికా పోలీసులు తమ చార్జ్ షీట్ లో దాఖలు చేశారు. మోదుగుమూడి కిషన్ అలియాస్ చెన్నుపాటి శ్రీరాజ్, అతని భార్య చంద్రకళా పూర్ణిమ అలియాస్ విభా జయంలు ఈ కేసులో నిందితులని ఇల్లినాయిస్ కోర్టులో చార్జ్ షీట్ వేశారు.

ఇక చికాగోలోని కిషన్ నివాసంపై దాడులు చేసిన తమకు నిర్దిష్ట వ్యక్తులను అమెరికాకు రప్పించేందుకు వీసాలు ఇవ్వాలంటూ యూఎస్ కౌన్సెల్ జనరల్ కు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) ఇచ్చిన  సిఫార్సు పత్రాలు, హీరోయిన్ల కోసం బుక్ చేసిన విమానం టికెట్లు, హోటల్ రూముల తాలూకు బుకింగ్స్ దొరికాయని తెలిపారు. వాళ్ల ఇంట్లో 70 కండోమ్ లు దొరికాయని పేర్కొన్నారు. కిషన్ భార్య చంద్రకళ హీరోయిన్ల రాకపోకలపై ఓ డైరీ రాసిందని, అదే తమకు కీలక ఆధారమని తెలిపారు. ఈ డైరీలో ఓ ప్రముఖ తెలుగు నటి పేరుంది. "వాషింగ్టన్ డీసీ - జనవరి 19 ఉదయం - రూమ్ నంబర్ 2018లో రెండు సార్లు, తరువాత రూమ్ నంబర్ 404లో ఒకసారి" అని రాసుంది. ఇక కిషన్ తప్పుడు సెక్యూరిటీ కార్డును సృష్టించాడని, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో వెల్లడైన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఓ హీరోయిన్ ను అమెరికాకు రప్పించేందుకు వీసాలు ఇవ్వాలంటూ యూఎస్ కౌన్సెల్ జనరల్ కు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టీఏఎస్) వీరికి సిఫార్సులు చేసింది. టీఏఎస్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో నవంబర్ 8, 2017న స్టార్ నైట్ ఈవెంట్ జరిగింది. అయితే, ఈ ఈవెంట్ అయిపోయిన రెండు రోజుల తర్వాత ఆ  హీరోయిన్ అమెరికాకు వచ్చింది. పైగా, ఆమె కాలిఫోర్నియా వెళ్లకుండా, మరో సమావేశంలో పాల్గొనడానికి చికాగో వెళ్లింది. ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.  
ATA
TAS
USA
chicago
Tollywood
S*x Rocket
Police
kishan

More Telugu News